November 4, 2026

సిరిపురం యాదయ్య తెలంగాణ చరిత్రలో ఓ దువత్రార…. సబితా ఇంద్రారెడ్డి

సిరిపురం యాదయ్య  తెలంగాణ చరిత్రలో ధ్రువతారగా నిలిచారని  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం  మహేశ్వరం మండలం పరిధిలోని పెద్దపులి నాగారం గ్రామంలో అమరుడు సిరిపురం యాదయ్య 35 వ జయంతి సందర్బంగా సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన  మంత్రివర్యులు, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో యువకిషోరం సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదన్నారు.  ప్రజల మనస్సులలో యాదయ్య ఎప్పటికి చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.ఈ కార్యక్రమంలో అమరుడు యాదయ్య గారి కుటుంబ సభ్యులు, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు