80% సబ్సిడీతో మైనార్టీ యువతకు ఈ స్కూటర్లు పంపిణీ… జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఆర్థిక అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ TGMFT ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మైనార్టీ యువతకు ఈ స్కూటర్ల పంపిణీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మైనార్టీ యువకులు ఆర్థికంగా ఎదగడానికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ స్కూటర్ పంపిణీ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో ఈ స్కూటర్ యూనిట్ సుమారు రూ. 1.50 లక్షలు ఉండగా అందులో 80 శాతం అనగా రూ.1,50,000 సబ్సిడీపై తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది మిగతా 20% అనగా 30వేల రూపాయలు లబ్ధిదారులు తన వాటాగా కట్టవలసి ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారులను ఉబెర్/ రాపిడో/ పోలా వంటి సేవా సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించబడుతుంది. ఆసక్తి కలిగి ఉన్న మైనార్టీ యువకులు ఈనెల 20వ తేదీ నుండి వచ్చేనెల మార్చ్ 1 వరకు TGOBMMS వెబ్సైట్ : http://tsobmms.cgg.gov.in లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అందుకుగాను ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికెట్, మైనార్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆహార భద్రత కార్డు అనగా రేషన్ కార్డ్ చిరునామా ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారుని వయస్సు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. దరఖాస్తుదారుని కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా ఉన్నవారు అర్హులు. ఈ అవకాశాన్ని వికారాబాద్ జిల్లాలోని అర్హులైన ముస్లిం మైనార్టీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.
