యువ విజ్ఞాన కార్యక్రమం 2026 రిజిస్ట్రేషన్లు ఈనెల 27 నుండి ప్రారంభం
ఇస్రో ప్రతి సంవత్సరం నిర్వహించే యువ విజ్ఞాన కార్యక్రమం యు వికా2026 రిజిస్ట్రేషన్లు ఈనెల 27 తేదీ నుండి మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. యువికా 2026 రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో నవాదు చేసుకోవాలి. గ్రామీణ యువతను సైన్స్ స్పేస్ టెక్నాలజీ పై ఆసక్తి పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. స్పేస్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, సాటిలైట్ టెక్నాలజీ పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. మే నెలలో రెండు వారాలపాటు హాస్టల్ వసతి కల్పించి విద్యార్థులకు శిక్షణను ఇస్తారు. ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్ సెషన్స్, ప్రాజెక్టులు, ఇంటర్ ఆక్టివ్ సెషన్లు తదితర అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. ముఖ్యంగా మన దేశంలో శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో, హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, సిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లలో శిక్షణ ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు ఇస్రో సైంటిస్టులతో నేరుగా అవగాహన కల్పించనున్నారు, సైన్స్ విభాగంలో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
