September 18, 2026

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తాండూరు బిజెపి కౌన్సిలర్లు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తాండూర్ మున్సిపల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూర్ పట్టణ బిజెపి అధ్యక్షులు,  వార్డ్ నెంబర్ 28 కౌన్సిలర్  నాగారం మల్లేశం,  వార్డ్ నెంబర్ 23 కౌన్సిలర్ అంతారం కిరణ్,  వార్డ్ నెంబర్ 33 కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో  కౌన్సిలర్లుగా విజయం సాధించారు.  దీంతో నేడు శనివారం ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి తమ వార్డులను అభివృద్ధి పరిచేందుకు సహాయ సహకారాలు అందించాలని  చేవెళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు.  నూతనంగా ఎన్నుకోబడిన బిజెపి కౌన్సిలర్లను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు.  ప్రజా సమస్యలను తీర్చాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముగ్గురు కౌన్సిలర్లకు సూచించారు.  ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు సేవ చేయాలని నాయకుడుగా  కాకుండా సేవకుడిలా  ప్రజలకు సేవలు అందించాలని ఎంపీ కొండ సూచించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.