ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాపాల్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతగిరి లోని హరిత రిసార్ట్స్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులను ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డిని అభినందించారు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డికి సూచించారు. తాండూరు మున్సిపల్ కు ప్రత్యేక నిధులు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ దుదెళ్ల మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పరి మల్లేశం,కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
