November 4, 2026

జీన్గుర్తి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లో జినుగుర్తి సర్పంచ్ కు అవమానం

తాండూరు మండలం జింగుర్తి గ్రామ శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జింగుర్తి సర్పంచ్ మడపతి శరణు స్వామికి అవమానం జరిగింది. ఆదివారం జరిగిన సందీపని గురుకుల నూతన భవన ప్రారంభోత్సవం మరియు గురుకుల పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఉక్కు మరియు వారి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు సర్పంచ్ శరణు స్వామిని స్టేజ్ పైకి పిలవకుండా అవమాన పరిచారు. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా నిర్వాహకులు మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటూ విలేకరులను అవమానపరిచి, నేడు స్టేజ్ పైకి పిలవకుండా సర్పంచును అవమానపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు. అలాంటిది జింగుర్తి గ్రామ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ శరణు స్వామిని వేదికపైకి పిలవకుండా నిర్వాహకులు అవమనించారు.