July 31, 2026

నేటి తరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరం….. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

నేటితరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  ఆదివారం జిన్గుర్తి శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస  ఫౌండేషన్ లో సందీపని గురుకులం  నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా విద్య బోధన  ఎంతో అవసరమని తెలిపారు.  తాండూరు మండలం జీన్గుర్తి లోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లో పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా విద్యా బోధన జరుగుతున్నదని కొనియాడారు. మారుమూల ప్రాంతం జినుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ద్వారా  కొనసాగే విద్య  భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.  విద్యను వ్యాపారం చేయకూడదనే  ముఖ్య ఉద్దేశంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్ వారికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి దేశానికి నాయకత్వం వహించే ఎంతోమంది నాయకులను,  ఐఏఎస్, ఐపీఎస్, న్యాయవాదులను, వైద్యులను, ఉన్నత అధికారులను, శాస్త్రవేత్తలను ఇక్కడి నుండి  ఫౌండేషన్ ద్వారా అందించబడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం కూడా అందరికీ విద్యను అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మన తాండూరులో పనులు కొనసాగుతున్నాయని అన్నారు.   ఈ కార్యక్రమంలో  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు.