ఈ ప్రభుత్వం నిరంకుషత్వ ప్రభుత్వమా ….! నిజాం ప్రభుత్వమా….! తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు నాగారం మల్లేశం ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం విమర్శించారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని తన నివాసంలో నాగారం మల్లేశం మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, తదితరులు పరామర్శించడానికి వెళ్తే వారిని మార్గమధ్యంలో అడ్డుకొని అరెస్టు చేయడం హేయమైన చర్య అని నాగారం మల్లేశం అన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం నిజాం ప్రభుత్వమా లేక నిరంకుశ ప్రభుత్వమా అర్థం కావడం లేదని, హిందువులపై ఒక విధంగా ఇతర కులాలపై ఇంకో విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. హిందూ పండగల సమయంలో తమకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇతర కులస్తులు ఏమీ అడగకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దోమ కృష్ణ, బసవరాజ్,మంతటి రాజు, ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
