May 15, 2026

అపస్మారక స్థితిలో ఉన్న ఓ వృద్ధున్ని కాపాడిన 108 సిబ్బంది

అపస్వారక స్థితిలో ఉన్న  ఓ వృద్ధున్ని  108  సిబ్బంది ప్రాణాలను కాపాడారు.  ఆదివారం  పెద్దెముల్  మండలం  సిద్ధన్నమడుగు తాండాకు చెందిన లాలు నాయక్ తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.  లాలూ నాయక్ అపస్మారక స్థితిలో ఉన్న స్థితిని చూసి ఇరుగుపొరుగువారు 108 కు కాల్ చేశారు.  దీంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని లాలు నాయక్ అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గ్రహించి సిపిఆర్ చేసిన అనంతరం ఇతర వైద్యం చేసి ఆయన ప్రాణాలను కాపాడారు.  దీంతో లాలూ నాయక్ కుటుంబీకులు మరియు సిద్దన్నమడుగు తాండ గ్రామస్తులు 108 సిబ్బందిని కొనియాడారు.  ఆపద్బాంధవుల్లాగా వచ్చి లాలూ నాయక్ ప్రాణాలను కాపాడారని 108 సిబ్బందికి జేజేలు పలికారు.