September 19, 2026

గాంధీనగర్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన బిర్కట్ రఘు

 తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 20 గాంధీనగర్లో ముస్లిం సోదరులకు బీర్కాట్ రఘు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.  రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు  ఇఫ్తార్ విందు  ఏర్పాటు చేస్తానని అందులో భాగంగా నేడు ఇఫ్తార్  విందును ఏర్పాటు చేసినట్లు బీర్కట్ రఘు తెలిపారు.  తాను ఎన్నికల్లో ఓటమి చెందిన విజయం సాధించిన  ప్రజల్లో ఉంటూనే  ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని బిర్కట్ రఘు తెలిపారు.  గాంధీ నగర్ లోని మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో బిర్కట్ రఘు ముస్లిం సోదరులకు పండ్లను అందించి  నేటి ఉపవాస దీక్షను విరవింపజేశారు.  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్,  జుబేర్ లాల  తదితరులు పాల్గొన్నారు.