బ్రతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించి ఏడు ఎకరాల భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మార్వో కు ఫిర్యాదు
యాలాల్ మండలం పగిడిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 614,విస్తీర్ణం: 3-00 ఎకరాలు,సర్వేనెంబర్ 573 విస్తీర్ణం: 4-00 ఎకరాల మొత్తం 7 ఎకరాల భూమిని ప్రభుత్వం 1990 సంవత్సరంలో పగిడిపల్లి గ్రామానికి చెందిన అప్తగిరి సాయమ్మ, భర్త చిన్న సాయప్పకు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పగిడిపల్లి గ్రామానికి చెందిన అప్తగిరి సుజాత,అప్తగిరి రాములమ్మ,అప్తగిరి ఇందిరమ్మ లు కలిసి దౌర్జన్యంగా అకారణంగా అప్తగిరి సాయమ్మను చనిపోక ముందే చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పట్టా చేసుకున్నారు పట్టా చేసుకున్నవారిపై అందుకు సహకరించిన వారి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. .లేని పక్షంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మల్కయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
