వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా దీపక్ తివారి
- వికారాబాద్ నూతన కలెక్టర్ గా దీపక్ తివారిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ బదిలీలలో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రతీక్ జైన్ ను నారాయణపేట్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. కొమరం భీమ్ జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న దీపక్ తివారిని వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
