July 30, 2026

తాండూర్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్లీ లీడర్ గా దీపా నర్సింహులు…

IMG-20260226-WA0440

తాండూర్  మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దీప నర్సిములుకు ఫ్లోర్ లీడర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ లోని సమస్యలను అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీసేందుకు పోరాడాలని, తాండూరులో అభివృద్ధి పరచాలని సూచించారు. ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ తనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినందుకు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, తాండూరు పట్టణ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంతరెడ్డి, అనిల్ కుమార్, ఇర్షాద్, జావిద్, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరబాను, అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీతా కరుణాకర్ పాటిల్, రూపరుద్రు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.