July 30, 2026

అధికారంలో ఉన్నారు …ముందు అభివృద్ధి పై దృష్టి సాధించండి….. బిఆర్ఎస్ నాయకుల ఫైర్

WhatsApp Image 2026-02-25 at 1.06.44 PM

అధికారంలో ఉన్నారు…. ముందు అభివృద్ధి పై దృష్టి  సాధించండి…. అని  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ  నాయకులకు సూచించారు. బుధవారం  మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాలరాజు అభివృద్ధిపై దృష్టి సాధించాలని అనవసర గొడవలపై కాదని సూచించారు. సాయిపూర్ కు మాత్రమే చైర్మన్ కాదని తాండూరు పట్టణంలోని 36 వార్డులకు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ  బాల్ రాజు అని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలని పట్లోళ్ల నరసింహులు అన్నారు. గతంలో రెండుసార్లు  బిఆర్ఎస్ పార్టీ నుండి   కౌన్సిలర్గా  గెలిచావని, తెలుగుదేశం పార్టీ నుండి ఓసారి తనపై పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. వార్డ్ నెంబర్ 10 లో  200 ఇందిరమ్మ ఇండ్లు,రెండు ఎకరాల స్థలాన్ని ఇస్తామని  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారని ఇచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి 200  ఇందిరమ్మ ఇండ్లు,  రెండు ఎకరాల స్థలం ఇవ్వవలసిందేనని అప్పటివరకు మిమ్మల్ని నిద్ర పోనివ్వనని అన్నారు.  మీ జాతకాలను బయటకు తీస్తున్న ముందుంది ముసళ్ళ పండుగ అంటూ  నరసింహులు విరుచుకుపడ్డారు. మా అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన భయపడేది లేదని,  ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీ వెంటే ఉంటూ నిలదీస్తానని తెలిపారు.