ఇందిరానగర్ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కళాకర్షణ కార్యక్రమం
శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కళాకర్షణ, పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. బుధవారం తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్ లో వెలసిన శ్రీ సీతారామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కళాకర్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మార్చ్ 25, 26, 27వ తేదీలలో స్వామివారి విగ్రహాల గుణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుందని అర్చకులు తెలిపారు. అందులో భాగంగా నేడు జరిగిన కళాకర్షణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు శుక్రవార్ పురోహిత్ తెలిపారు. నేటి నుండి శ్రీరామనవమి వరకు దేవాలయంలో ప్రత్యేక పూజలు మండల పూజలు, నవగ్రహ పూజలు, హోమాలు నిర్వహిస్తామని, స్వామివారి దేవాలయ పునర్నిర్మాణ, పున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, అంజిల్ రెడ్డి, ఇందిరానగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
