గిరిజన బాలబాలికలకు క్రీడా పాఠశాలలో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల…
గిరిజన బాల బాలికలకు (క్రీడా పాఠశాలలో) వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి బోయిన్పల్లి లోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాయా కింగ్, కే నోయింగ్, సేయిలింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ లో గిరిజన బాలబాలికలకు వారి ప్రతిభ ఆధారంగా 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశం కల్పించనున్నారు. అందుకుగాను పదిమంది బాలికలకు పది మంది బాలురకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆ పాఠశాలలో ప్రవేశానికి వారు ఐటిడిఏ మైదాన ప్రాంత జిల్లాలకు సంబంధించిన బాలబాలికలకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ వాటర్ స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందు బాలబాలికలకు ప్రత్యేకమైన ఆహారం, వసతి, స్పోర్ట్స్ దుస్తులు, షోజు మరియు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు 4వ తరగతి ఉత్తీర్ణులై రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మర్పల్లిలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, 9542972094, గిరిజన బాలుర పాఠశాల కులక్చర్ల 9959293604 సంప్రదించాలని, అక్కడే ఎంపిక ఉంటుందని వికారాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
