July 31, 2026
rythu-bharosa-2
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17:
యాసంగి-2025 సీజన్‌కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు ‘రైతు భరోసా’ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టా అయిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పెద్దేముల్ మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ ప్రీతమ్
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
అర్హులైన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారంతో పాటు ఈ క్రింది పత్రాల జిరాక్సులను తమ క్లస్టర్ ఏఈఓ (AEO)లకు సమర్పించాల్సి ఉంటుంది:
  • పట్టాదార్ పాస్‌బుక్
  • ఆధార్ కార్డు
  • బ్యాంకు ఖాతా పుస్తకం (బ్యాంకు వివరాల మార్పు కోరుకునే వారు కూడా ఇవే పత్రాలు ఇవ్వాలి).
చివరి తేదీ మార్చి 20:
దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 20, 2026 ఆఖరి తేదీ అని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే దరఖాస్తు చేసుకుని, ప్రస్తుతం రైతు భరోసా నిధులు పొందుతున్న పాత రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఏఓ వివరించారు.