July 30, 2026
IMG-20260315-WA0006

 సంకల్పం పెద్దేముల్, మండలంలోని ఇందూరు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గ్రామంలోని మైనారిటీ గల్లీలో రూ. 10 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ వెంకట్ ముదిరాజ్ ఆదివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకట్ మాట్లాడుతూ.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ఇందూరు గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో మరిన్ని నిధులు రాబట్టి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఫరీద, పనుల కాంట్రాక్టర్ వి.మహేష్ కుమార్, నాయకులు మోసిన్, మాసుం, నయీం, అమ్ము, కే. రవి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.