July 30, 2026

రైతులారా… నిరాశ నిస్పృహలతో కృంగి పోకండి…. కిసాన్ మిత్రకు కాల్ చేయండి…. కిసాన్ మిత్ర కరుణానిధి

IMG_20260313_131839245

రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు.  తాండూరు నియోజకవర్గం లోని రైతులు భూమి, రెవెన్యూ సమస్యలు ఉంటే నిరాశ చెందకుండా  కిసాన్ మిత్ర నంబర్కు కాల్ చేయాలని  కరుణానిధి కోరారు.  ఆదివాసి హక్కులు, పంట రుణాల సమస్యలు, రైతు భరోసా, పిఎం కిసాన్, గ్రామీణ, వ్యవసాయ పథకాలు, మార్కెట్ వ్యవస్థ, ధరలు, ప్రకృతి వైపరీత్యాలు,  కౌలు సమస్యలు, రైతుల గుర్తింపు, పంటల బీమా, రైతు బీమా,  ఉపాధి హామీ పథకం, నకిలీ విత్తనాల సమస్యలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో రైతులు నిరాశ చెందితే కిసాన్ మిత్ర ప్రతినిధికి ఫోన్ చేసి సమస్యలను తెలుపాలని కరుణానిధి కోరారు.