July 31, 2026

విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది  ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి

IMG-20260315-WA0082

– రూ. 2.30 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభం
– కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి


పెద్దేముల్: విద్యార్థుల అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పేర్కొన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామంలోని పెద్దేముల్ మండల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో రూ. 2 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల్యం అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో అలవర్చుకునే క్రమశిక్షణ, అలవాట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయని విద్యార్థినులకు సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడకూడదనే లక్ష్యంతో డిజిటల్ బోర్డులు, లైబ్రరీలు, సైన్స్ ల్యాబ్‌ల వంటి అత్యాధునిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగళి సునీత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్న, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, టిపిసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, శోభరాణి, లొంక నర్సింలు, మల్లేశం, ఎల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కెపి రావు, కోటపల్లి బందయ్య,  విద్యాలయ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.