July 31, 2026

తాండూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కోటా మురళీకృష్ణ విజయం

IMG_20260315_173005497

తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా కోటా మురళీకృష్ణ విజయం సాధించారు.  గత కొన్ని రోజులుగా కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ కోట మురళి కృష్ణ ప్యానల్  జోరుగా ప్రచారం  నిర్వహించారు.  ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన పోలింగ్లో కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ కు చెందిన ఇద్దరు సభ్యులు,  కోటా మురళీకృష్ణ  ప్యానెల్ కు సంబంధించిన ముగ్గురు విజయం సాధించారు.  మొదట కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ కు చెందిన ఇద్దరు సభ్యులు అయిత విజయ్ కుమార్, గుముడాల  గౌరీ శంకర్ వరసగా విజయం సాధించడంతో  కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ విజయం  సాధించడం ఉందని పలువురు అనుకున్నారు…. కానీ  మూడవ అభ్యర్థి రొంపల్లి సంతోష్ ఆపజేయం చెందడంతో  వరసగా ముగ్గురు  కోటా మురళి కృష్ణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారు.  ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన చివరికి కోటా మురళీకృష్ణ  ప్యానల్ లోని ముగ్గురు విజయం సాధించారు. కోట మురళీకృష్ణ తన ప్రత్యర్థి కోడూరు వినోద్ కుమార్ పై 39 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  గుడిపల్లి అనిల్ పై  గుబ్బ యాదయ్య 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  రొంపల్లి సంతోష్ కుమార్ పై  కోట్రీక కిరణ్ అత్యధిక మెజార్టీ 84 ఓట్ల తో విజయం సాధించారు.  పోలా వేణుగోపాల్ పై   గుముడాల  గౌరీ శంకర్ 51ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా,  అడికిచెర్ల సంజీవ్ కుమార్ పై  అయిత విజయ్ కుమార్  అతి తక్కువ ఓట్లు కేవలం ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా మాజీ పీపుల్స్ కళాశాల ప్రిన్సిపాల్ కోస్గి తిప్పయ్య, పలువురు ఉపాధ్యాయులు ఎన్నికల  అసిస్టెంట్ అధికారులుగా   వ్యవహరించారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు  తాండూరు పట్టణ పోలీసులు ఎస్ఐ సాజీద్ ఆధ్వర్యంలో గడ్డి బందోబస్తు నిర్వహించారు.   ఆర్యవైశ్య సంఘం ఎన్నికల  అనంతరం గెలుపొందిన కోట మురళి కృష్ణ  ప్రధాన కార్యదర్శి కోట్రీక కిరణ్,   గుబ్బ యాదయ్య,  కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ లోని  అయిత విజయకుమార్, గుముడాల గౌరీ శంకర్ లను ఆర్యవైశ్య సంఘం నాయకులు సభ్యులు ఘనంగా సన్మానించారు. కోట మురళీకృష్ణ విజయం కోసం కృషిచేసిన కటకం వీరేందర్, భీమ్ శెట్టి అనిల్,  కోట్రీక శ్రీకాంత్ పునీత్, రమేష్, తర్లపల్లి  భాను, రంజిత్, పోలా శ్రీనివాస్, రవి, కల్వ రఘు, కల్వ రాజా వంశీ, సాయి, వెంకట్, చాగి అనిల్,జనగాం అనిల్,  కుంచెం మురళి  తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఆర్యవైశ్య కళ్యాణ మంటపం  నుండి తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం వరకు  విజయోత్సవ  ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.