September 19, 2026
IMG-20260317-WA0020
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వికారాబాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఈఓ) సుధీర్ కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జనగాం, మారేపల్లి, గాజీపూర్, కందనెల్లి తండాలలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు.
నాణ్యతతో కూడిన పనులు త్వరగా పూర్తి చేయాలి:
జనగాం గ్రామ పంచాయతీ భవనం, వి.ఓ భవనం, పాఠశాల కాంపౌండ్ వాల్ మరియు పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన సీఈఓ, పనుల్లో జాప్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్‌కు, కాంట్రాక్టరుకు సూచించారు. అనంతరం మారేపల్లిలో వి.ఓ భవనం, సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు.
కొత్త పనులకు గ్రీన్ సిగ్నల్:
గాజీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, సిసి రోడ్డు పనులపై సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో చర్చించారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే కందనెల్లి తండాలో సిసి రోడ్డు పనుల స్థలాన్ని పరిశీలించి పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డి.ఇ (DE) నాగభూషణం, ఎంపీడీఓ (MPDO) రతన్ సింగ్, ఏఈ (AE) వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.