July 30, 2026

ఏసీబీ వలలో పెద్దేముల్ ఆర్‌ఐ.. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రిచర్డ్ సైమన్

IMG-20260317-WA0034
సంకల్పం పెద్దేముల్, (ప్రతినిధి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒక మ్యుటేషన్ ఫైలును క్లియర్ చేసేందుకు గాను రూ. 15,000 లంచం డిమాండ్ చేసిన మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) రిచర్డ్ సైమన్, హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఆ నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు:
ఆర్‌ఐ పట్టుబడిన వెంటనే ఏసీబీ బృందాలు పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టాయి. మ్యుటేషన్లకు సంబంధించిన పలు కీలక ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కార్యాలయంలోని ఇతర సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆర్‌ఐ లంచం తీసుకుంటూ పట్టుబడటంతో రెవెన్యూ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.