July 30, 2026

రాజకీయాలు చేసే సమయం కాదు, తాండూర్ ప్రతిష్టను కాపాడుకోవల్సిన సమయం…!

IMG-20260318-WA0031

 యాలాల్ మండలంలో డ్రగ్స్ నివారణకై అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యవంతులు, యువత….

 తాండూర్ వ్యాప్తంగా డ్రగ్స్ నివారణకు అవగాహన ర్యాలీలు..!

 గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫాం హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో తాండూర్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు…

     గత ఐదు సంవత్సరాల నుండి తాండూర్ డ్రగ్స్ మాఫియా నడుస్తుందని పలుమార్లు బహిరంగంగా చెప్పిన అధికార అండదండలతో కొంతమంది నాయకులు డ్రగ్స్ వాడటం కాదు డ్రగ్స్ సప్లయర్స్ గా మారారు..

    ఇలాంటి ఫాం హౌస్ పార్టీలు కూడా తాండూర్ సమీపంలో గతంలో ఎన్నో జరిగాయి, దీనితో ఎంతో మంది యువకులు రోడ్డున పడి జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, అలాంటి వారందరికీ కనువిప్పు కలిగే విధంగా ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు మరోసారి తెరపైకి రావడంతో డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని లక్ష్యంతో ఈరోజు పెద్దెములు మండలంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది..

   ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇప్పుడున్న పిల్లలకి డ్రగ్స్ వాడకం పట్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, మేధావి వర్గం కూడా సోషల్ మీడియాలలో యాంటీ డ్రగ్స్ మూమెంట్ ని ఉదృతం చేసి యువత డ్రగ్స్ బారిన పడకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు అన్నారు..

ఇలాంటి సమయంలో ప్రజా ప్రతినిధులు కూడా పార్టీలను పక్కనపెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమించి సమాజంలో మన పిల్లల్ని యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు..

  ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, అక్బర్ బాబ, భీమప్ప, హనుమంతు,శ్రీధర్, వీరేశంతో పాటు పలువురు పాల్గొన్నారు..