July 30, 2026

తాండూరులో ఘనంగా బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం

WhatsApp Image 2026-04-06 at 12.40.54 PM

తాండూరు పట్టణంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ  దినోత్సవం జరిగింది.  సోమవారం తాండూరు పట్టణ  బిజెపి అధ్యక్షులు నాగారం మల్లేశం అధ్యక్షతన  వార్డు నంబర్ 28 అంబేడ్కర్ చౌక్ లో నాగారం మల్లేశం,  వార్డు నెంబర్ 23  కౌన్సిలర్ అంతరం కిరణ్  బిజెపి  జెండాను ఎగరవేశారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్  కుమార్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  రమేష్  మాట్లాడుతూ బిజెపి వల్లనే సుస్థిరపాలన సాధ్యమని, ప్రస్తుతం  దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు.  దేశంలో ఏ పార్టీ నుండి కానీ అభివృద్ధి పనులు కేవలం బిజెపితోనే సాధ్యమని ఉపరి రమేష్ కుమార్ అన్నారు.  ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మనోహర్  రావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్,  రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సాహూ శ్రీలత, జిల్లా నాయకులు పటేల్ విజయకుమార్, భద్రేశ్వర్. కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారి శ్రీకాంత్, ఇందూరు రాములు, రూపేష్ కుమార్, పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి మంతటి  రాజు, ఉపాధ్యక్షులు చిదిరి ప్రకాష్, ప్రభాకర్ గౌడ్, చాకలి బిచ్చప్ప, పటేల్ చందు,  వడ్డే సాయిలు, బసవరాజ్, బబ్లు, శివాజీ ఠాగూర్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యాలాల మండల కేంద్రంలో యాలల మండల బిజెపి అధ్యక్షులు ఆకుల శివకుమార్ జెండా ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు జంగం యాదగిరి, సీనియర్ నాయకులు నర్సింలు, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.