July 30, 2026

దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డిఓకు వినతి పత్రం

WhatsApp Image 2026-04-06 at 4.51.12 PM

దళితుల భూములను దౌర్జన్యం చేస్తూ ఆక్రమిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాండూరు ఆర్డీవోకు దళితులు వినతి పత్రాన్ని అందజేశారు.  సోమవారం  తాండూర్ ఆర్డీవోకు యాలాల మండలం బండమీదిపల్లి గ్రామస్తులు ఫిర్యాదును అందజేశారు.  ఈ సందర్భంగా దళితులు  మంతటి ఆశప్ప, మంతటి బుజ్జమ్మ, దాసరి అమ్మదాస్, పర్సాపురం చంద్రప్ప మాట్లాడుతూ సర్వే నంబర్ 1, 5, 8 లో గల తొమ్మిది ఎకరాల 21 గంటల ప్రభుత్వ భూమి లో దళితులు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని అలాంటి వారిని కాదని కొందరు దౌర్జన్యంగా,  పోలీసులను తీసుకువచ్చి తమకు  గతంలో ప్రభుత్వం ఇచ్చిన  భూమిలో  జెసిబిల సహాయంతో  భూమిని చదును చేస్తున్నారని,  తాము అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని,  తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను తమకే చెందేలా న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.