బిజెపి తాండూర్ మున్సిపల్ లో ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం నియామకం
తాండూరు మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశంను నియమించారు. సోమవారం వికారాబాద్ జిల్లా బిజెపి కన్వీనర్ కర్ణం ప్రహ్లాద రావు నాగారం మల్లేశం బిజెపి ఫ్లోర్ లీడర్ గా ఉండేందుకు నియామక పత్రాన్ని అందజేశారు. దీంతో తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి బిజెపి ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశంను నియమించినట్టు బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మనోహర్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్, బిజెపి కౌన్సిలర్లు అంతరం కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తాండూరు పట్టణ బిజెపి కార్యవర్గ సభ్యులు చిదిరి ప్రకాష్, మంతటి రాజు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, చాకలి బిచ్చప్ప, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
