September 18, 2026

బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పరి రమేష్ కుమార్ నియామకం……తాండూరు నియోజకవర్గానికి తొలిసారి జిల్లా అధ్యక్ష పదవి

ChatGPT Image Aug 6, 2026, 12_49_22 AM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వికారాబాద్(అనంతగిరి) జిల్లా అధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పరి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకంతో తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి దక్కడం విశేషంగా మారింది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొప్పుల రాజశేఖర్ రెడ్డిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన అనంతరం, చాలా కాలంగా జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా కొనసాగింది. ఆ సమయంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించేందుకు పార్టీ సీనియర్ నాయకులు  కర్ణం ప్రహ్లాద్ రావును  జిల్లా కన్వీనర్ గా నియమించారు.  వికారాబాద్ పట్టణానికి చెందిన పలువురు బిజెపి నాయకులు జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు పోటీపడినప్పటికీ, పార్టీ అధిష్ఠానం ఉప్పరి రమేష్ కుమార్‌పై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించింది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండే నాయకుడిగా గుర్తింపు పొందిన ఉప్పరి రమేష్‌కు ఈ కీలక బాధ్యతలు దక్కడం పట్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉప్పరి రమేష్ కుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో వికారాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని విస్తరించి ప్రజల్లో మరింత ఆదరణ పొందేలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పరి రమేష్ కుమార్ నియామకం బీజేపీ జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాడేందుకు ఆయన నాయకత్వం దోహదపడుతుందని కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.