September 18, 2026

పొలంగట్ల మధ్య త్రివర్ణ పతాకం.. రైతన్నలతో కలిసి వినూత్న స్వాతంత్ర్య వేడుకలు

IMG-20260815-WA1403(1)

దేశభక్తికి వినూత్న రూపం…పచ్చటి పంట పొలాల మధ్య రైతన్నలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు కంజర్ల విజయలక్ష్మి యాదవ్. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళా రైతులు, రైతన్నలు, యువతతో కలిసి పొలం గట్ల మధ్య జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటారు. దేశంలోనే అరుదైన రీతిలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాండూర్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా పలు సేవా కార్యక్రమాలతో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ప్రజల మన్ననలు పొందుతున్నారు.ముఖ్యంగా మహిళల కోసం గడప గడపకు వెళ్లి చీరసారెలతో శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించడం… బాలింత తల్లులకు జనని కిట్లను అందించడం… అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.ప్రజా సేవతో పాటు దేశభక్తిని చాటే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ… రైతన్నలు, మహిళలు, యువతను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్న కంజర్ల విజయలక్ష్మి యాదవ్ కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.