రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్‌ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేశ్ కుమార్
బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు డా. కె. లక్ష్మణ్‌ను బీజేపీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు యు. రమేశ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు డా. కె. లక్ష్మణ్‌కు యు. రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని, ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.రాబోయే రోజుల్లో వికారాబాద్ జిల్లాలో బీజేపీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామని యు. రమేశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, భద్రశ్వర్, రమేష్ సాగర్, రాము, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
