September 19, 2026

కారెక్కిన వెంకటాచారి…

IMG-20260204-WA1222

….కారెక్కిన వెంకటేష్ చారి
…..గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పైలట్ రోహిత్ రెడ్డి.

పెద్దమూల్ మండలం గాజీపూర్ మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటేష్ చారి బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి , మండల సీనియర్ నాయకులు రమేష్, జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వీరప్ప,ఉప సర్పంచ్ ఎల్లప్ప, సంగమేశ్వర్, ముస్తఫా, లాలు, అంజి, వెంకట్ గౌడ్,కృష్ణ,వెంకట్ తదితరులు ఉన్నారు.