దారూరు లో పట్టపగలే దారుణ హత్య…. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
దారూరు లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. హత్య చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బుధవారం వికారాబాద్ జిల్లా దారూర్ గ్రామంలో పట్టపగలే హత్య జరిగింది. రాంపూర్ గ్రామానికి చెందిన శంకర్ మరో వ్యక్తికి మధ్య ఎన్నో రోజులుగా భూ వివాదం ఉందని వినికిడి. భూ విషయంలో పలుమార్లు గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. శంకర్ ను హత్య చేసిన వ్యక్తి దారూర్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
