May 15, 2026

తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమింపబడే జుబేర్ లాల ను సన్మానించిన ఎమ్మెల్యే బోయని మనోహర్ రెడ్డి

IMG-20260204-WA0900(1)

తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమింపబడే జుబేర్ లాల ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుబేర్ లాలాకు శాలువా పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నూతన తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జుబేర్ లాలాకు త్వరలో నియామక పత్రం అందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాలని జుబేర్ లాగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రావుఫ్, మసూద్, సాయప్ప, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.