May 15, 2026

భారీ మెజారిటీతో గెలిపించండి….9వ వార్డును అభివృద్ధి పరుస్తా…. పార్టీ అభ్యర్థి పట్లోళ్ల చైతన్య ప్రశాంత్

IMG-20260205-WA0752

తాండూరు పట్టణం సాయిపూర్ లోని తొమ్మిదో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ అన్నారు. గురువారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా పోచమ్మ గుడి, తాత గుడి,వీరశివాజీ నగర్, సద్గురు సాయినాథ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న 9వ వార్డు ఎలాంటి అభివృద్ధి జరగలేకపోయిందని అన్నారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే సిసి రోడ్లను వేశారని, కాలనీలోని ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాలనీలోని వారిని యువకులను బెదిరింపుల గురి చేస్తే సహించేది లేదని, చేసిన అక్రమాలను బయటికి తీస్తామని తెలిపారు. 9వ వార్డులోని మురికి కాలువలు, సిసిరోడ్లు, విద్యుత్ సమస్యలను తీరుస్తానని తెలిపారు.చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే 9వ వార్డును అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ తెలిపారు.

…..భారీ మెజారిటీతో గెలిపించండి….9వ వార్డును అభివృద్ధి పరుస్తా…. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల చైతన్యప్రశాంత్