May 15, 2026

36వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరి చందనను భారీ మెజార్టీతో గెలిపించండి… ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

IMG-20260205-WA0781

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వార్డు నెంబర్ 36 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వ సిరి చందనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వార్డ్ ప్రజలకు సూచించారు. 36వ వార్డులో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్య, త్రాగునీటి వ్యవస్థ, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్తు రానివారికి వచ్చేలా చూస్తామని, బీదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల మంజూరు చేయిస్తామని తెలిపారు. మైనార్టీల సమస్యలు తీరుస్తామని, మోచిగల్లి, దోబిగల్లిలోని ప్రజల సమస్యలు తీరుస్తామని, కాలనీవాసుల మంచినీటి అన్నిటి సమస్యలు తీర్చేందుకు బోర్లు వేయిస్తామని తెలిపారు. 36వ వార్డు అభ్యర్థి కల్వ సిరిసందన ఉన్నత చదువు చదువుకున్న అభ్యర్థి అని, ఆమె ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తీర్చనిందని తెలిపారు. అందువల్ల 36వ వార్డు అభివృద్ధి బాధ్యత తనే స్వీకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. 36 వార్డు అభ్యర్థి కల్వ సిరి చందన ను విజయం సాధించే దిశగా ఇంచార్జ్ బాధ్యతలు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ కు బాధ్యతలు అప్పజెప్పమని తెలిపారు.
….36వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరి చందనను భారీ మెజార్టీతో గెలిపించండి… ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి