September 19, 2026

రేపు మధ్యాహ్నం పటేల్ ప్రవీణ్ యాదిలో అన్నదానం ….. వీరశైవ యువదళ్

IMG_20260205_162532184_HDR

తాండూర్ వీరశైవ యువదళ్ గౌరవ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈనెల 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం అన్నదాన సత్రం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీరశైవ యువదళ్ ప్రతినిధులు మాట్లాడుతూ పటేల్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా అందరి మనసులో ఉన్నారని పటేల్ ప్రవీణ్ ను గుర్తు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నామని ఈ అన్నదాన కార్యక్రమానికి పటేల్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, బంధువులు, వీరశైవ సభ్యులు ప్రతినిధులు, వీర శైవ సమాజం సభ్యులు దాన కార్యక్రమంలో పాల్గొనాలని వీరశైవ యువదళ్ ప్రతినిధులు కోరారు.

…….పటేల్ ప్రవీణ్ యాదిలో అన్నదానం ….. వీరశైవ యువదళ్