చత్రపతి శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి…. యాదవ్ ఉప సర్పంచ్ శోభ రాజిరెడ్డి
చత్రపతి శివాజీ మహారాజ్ ను యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని యాలాల్ ఉప సర్పంచ్ శోభ రాజిరెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాలాల్ ఉప సర్పంచ్ శోభ రాజిరెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ యువకులందరికీ ఆదర్శమని, ఆయన అందరివాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, సిపిఎం నాయకులు మల్కయ్య, బుగ్గప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు నాగయ్య, నరసింహులు, గుంతల్ బషీర్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.
