July 31, 2026

యువత చత్రపతి శివాజీ మహారాజు ను ఆదర్శంగా తీసుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి…. డాక్టర్ సంపత్ కుమార్

యువకులు చత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ రామ్ మందిర్ దగ్గర ఏర్పాటుచేసిన శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ యువకులు చత్రపతి శివాజీ మహారాజ్, వివేకానంద స్వామి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని అన్నారు. ముఖ్యంగా యువకులు మద్యానికి దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, 6వ వార్డ్ కౌన్సిలర్ అనిల్ కుమార్, భద్రప్ప, అంజిల్ రెడ్డి, దోమ కృష్ణ, దోమ శ్రీనివాస్ యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అనే నినాదాలు చేశారు.