అపోలో ఫార్మసీ లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా …. జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్బూస్ సుభాన్
అపోలో ఫార్మసీలో ఉద్యోగుల కోసం జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబుస్ సుభాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 శనివారం ఉదయం 10.30కు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, ఐటిఐ క్యాంపస్ వికారాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, అపోలో ఫార్మసీలో సుమారు 100కు పైగా ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైన్ అసోసియేట్ పోస్టుల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని వికారాబాద్, హైదరాబాద్ లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్హత కలిగి ఉన్నవారు అర్హులని తెలిపారు. శనివారం జరిగే ఉద్యోగ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఉద్యోగ అవకాశం పొందాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. ఇతర వివరాలకు మియా సాబ్ 9676047444 లో సంప్రదించవచ్చని వివరించారు.
