అన్ని పదవులు సాయిపూర్ వారికేనా …..! అధికార పార్టీ నాయకుల అంతర్మదనం
అన్ని పదవులు సాయిపూర్ కు చెందిన నాయకులకేనా అని అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నాయకులు కినుకు వహించారు. తాండూర్ మున్సిపల్ చైర్మన్ పదవి నీరజాబాల్ రెడ్డికి కేటాయించగా, ఇప్పటివరకు ఉన్న తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పట్లోళ్ల బాల్రెడ్డి కొనసాగగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒకే కుటుంబానికి రెండు పదవులు ఉండరాదు అంటూ తన కుటుంబానికి చైర్మన్ పదవి దక్కినందున తన పదవి రాజీనామా చేసిన బాల్రెడ్డి అనంతరం అదేవిధంగా పట్లోళ్ల నరసింహులు ఇవ్వడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి బంటుమల్లప్పకు ఇవ్వనున్నారు. దీంతో పలువురు సీనియర్ నాయకులు అన్ని పదవులు సాయిపూరు నాయకులకేనా అని అసహనంతో ఉన్నారు. అధిష్టానం సమన్యాయం పాటిస్తారేమో, అందరినీ కలుపుకొని పోతారేమో అనుకున్నాం కానీ కేవలం సాయిపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని లోలోన కొమిలిపోతున్నారు కొందరు నాయకులు. ఇదిలాగే కొనసాగితే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపేందుకు కూడా కొందరు నాయకులు తయారయ్యారు. కొందరు నాయకులు ఇతర పార్టీల నాయకులతో చర్చలు కూడా మొదలుపెట్టారని వినికిడి.
