July 31, 2026

విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.. అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాదరక్షలు, బ్యాగుల అందజేత

విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.. అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాదరక్షలు, బ్యాగుల అందజేత

– సేవలను కొనియాడిన గ్రామ సర్పంచ్ డివై నర్సింలు 

సంకల్పం పెద్దేముల్: మండల పరిధిలోని పెద్దేముల్ హరిజనవాడ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం పాదరక్షలు, స్కూల్ బ్యాగులు, మ్యాట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ డివై నర్సింలు, ఉప సర్పంచ్ ప్రసాద్, వార్డు మెంబర్ వెంకటేశ్, హెడ్ కానిస్టేబుల్ రఫీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ప్రకాష్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సేవ చేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంకిత స్వచ్ఛంద సంస్థ తమ వంతుగా సాయం చేయడం శుభపరిణామమని, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గౌసియా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్, ఉపాధ్యాయుడు ఆంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.