ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి…. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని శంకర్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో 6708 విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు 1686, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 6548, ఒకేషనల్ 1457 నంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 8394, ద్వితీయ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సులలో 8006 మంది విద్యార్థులు హాజరు కాలు ఉన్నారని తెలిపారు. కాగా జిల్లా వ్యాప్తంగా 28 థియరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ థియరీ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ నియమ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగు నీటివసతి తప్పకుండా కల్పించాలని కోరారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని కోరారు. పరీక్షల నిర్వహణలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, సత్తయ్య, డిస్ట్రిక్ట్ బల్క్ ఇంచార్జ్ నరసింహారెడ్డి, సురేశ్వర స్వామి, వెంకటేశ్వర రావు వివిధ కళాశాలల చీఫ్ సూపరెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్లయింగ్ స్పాట్ సభ్యులు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, కస్టోడియన్స్ తదితరులు పాల్గొన్నారు.
