May 15, 2026

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు…

తాండూరు పట్టణ శివారులోని హైదరాబాద్ రోడ్డులో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కసరత్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లతోపాటు, విద్యుత్ మరుగుదొడ్లు తదితర వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ లను ఎవరికి పంపిణీ చేయాలో ఎలా పంపిణీ చేయాలో అనే విషయంపై విధి విధానాలను రూపొందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అందులో భాగంగానే బీదలకు డబుల్ బెడ్రూంలో పంపిణి చేసే విధి విధాల కోసం క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించామని తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, కొన్ని గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి,  స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.