సుమిత్ గౌడ్ చేసిన సవాలును వైస్ చైర్మన్ స్వీకరిస్తారా….? తప్పించుకుంటారా?
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుమిత్ గౌడ్ చేసిన సవాలును వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ స్వీకరిస్తారా? తప్పించుకుంటారా?… ఇలాంటి రంగు ఆర్భాటం లేకుండా విజయం సాధించిన అబ్దుల్ రజాక్ సుమిత్ గౌడ్ విసిరిన సవాలును వైస్ చైర్మన్ తో పాటు పరోక్షంగా ఎమ్మెల్యేకు కూడా సవాలు చేశారు. తాండూర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 29 లో నిజంగానే బోగస్ ఓట్లు ఉన్నాయా? వాటితోనే ఆయన విజయం సాధించారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. అబ్దుల్ రజాక్ గెలిచిన విజయాన్ని తాను స్వీకరించమని సుమిత్ గౌడ్ నిక్కచ్చిగా, బాధతో, ఆవేదనతో చెప్పారు. నిజంగానే బోగస్ ఓట్లతో గెలిస్తే ఆ విజయం విజయమే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు హర్షించరు. ఒక్కో ఇంటి నెంబర్ పై ఇంటి యజమానికి తెలియకుండానే తమకు కావలసిన వారితో ఓటర్ల నమోదు చేసి విజయం సాధించడం అదొక విజయమా? అంటూ టిఆర్ఎస్ నాయకులు సుమిత్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదొక్క వార్డు మాత్రమే కాకుండా తాండూర్ పట్టణంలోని 36 వార్డులలో కూడా … ప్రతి వార్డులో 300 ఓట్లు అక్రమంగా నమోదు అయ్యాయని వాటితోనే వారు విజయం సాధించారని సుమిత్ గౌడ ఆరోపించారు. సాధారణంగా విలేకరుల ముందుకు రాని సుమిత్ గౌడ్ తన ఆవేదనను నిజాయితీగా మీడియా ముందు ఉంచారు. సుమిత్ గౌడ్ ఆధారాలతో పాటు బోగస్ ఓట్లను నిరూపించారు. కొందరి ఇంటి నంబర్లపై ఇంటి యజమానులకు తెలియకుండానే ఓటర్ లిస్టులో ఓట్లు ఎలా నమోదు అయ్యాయో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల ఆధారంగా నూతన ఓటర్ల పేర్లను నమోదు చేశారని సుమిత్ గౌడ్ ఆరోపించారు. ప్రజా పాలన దరఖాస్తులోని ఆధార్ కార్డులు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా చేరాయి అనేది ఓ పెద్ద ప్రశ్న….? చనిపోయిన వారి ఓట్లను తొలగించాలంటే నోటీసులు ఇచ్చారని, మరి నూతన ఓటర్లను చేర్చుకునేటప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని సుమిత్ గౌడ్ ఆరోపించారు. సుమిత్ గౌడ్ నిజాయితీగా చేసిన ఆరోపణలను ప్రత్యర్థులు స్వీకరించి నిరూపించుకునే దమ్ము ధైర్యం ఉందా అని సమితి గౌడ్ చేసిన సవాలును స్వీకరించి ప్రత్యర్థులు సరైన సమాధానం చెప్తారా లేక తప్పించుకుని తిరుగుతారా అనేది ఓ పెద్ద ప్రశ్న…. వారి సవాలు స్వీకరించి ఆధారాలతో వారు కూడా నిరూపిస్తేనే ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడిన వారవుతారు. సుమిత్ గౌడ్ చేసిన ఆరోపణలు తాండూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
