July 30, 2026

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా దీపక్ తివారి చేపట్టిన పదవీ బాధ్యతలు

WhatsApp Image 2026-02-28 at 6.34.57 PM

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా దీపక్ తివారి పదవీ బాధ్యతలు చేపట్టారు.  శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని  ఐడిఓసి కార్యాలయంలో  కలెక్టర్ కార్యాలయంలో తొలి సంతకం చేసి అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు.  ఈ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)  రాజేశ్వరి,  (లోకల్ బాడీ) అదనపు కలెక్టర్  సుధీర్,  ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి,  నూతన  కలెక్టర్ దీపక్వారిని కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్కు అభినందనలు తెలిపారు.  అనంతరం జిల్లా అధికారులతో సిబ్బందితో నూతన కలెక్టర్ దీపక్ తివారి తో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ తనకు వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  ప్రభుత్వ ప్రాధాన్యతలు,  లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పారదర్శకంగా,  విద్య, వైద్యం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతమైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సాధిస్తానని నూతన కలెక్టర్ తెలిపారు.  జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజలతో సంబంధాలు నెలకొల్పడం తదితర అంశాల్లో సమగ్రంగా ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు నూతన కలెక్టర్ సూచించారు.  త్వరలో అన్ని శాఖల అధికారులతో, మండల స్థాయి అధికారులతో  రివ్యూ నిర్వహిస్తామని, మీరు చేపట్టే పనులు, అభివృద్ధి చేస్తున్న పనుల ఫోటోలు పూర్తివివరాలను తమకు సమర్పించాలని నూతన కలెక్టర్ సూచించారు.  ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ మంగీలాల్, ఆర్డిఓ వాసు చంద్ర, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, డిఆర్డిఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.