July 31, 2026

పెద్దేముల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ దినోత్సవం’

IMG-20260228-WA0013

– పెద్దేముల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా
– ‘జాతీయ సైన్స్ దినోత్సవం’
– ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు:

– సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు

సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రాజెక్టులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రాజెక్టులను పరిశీలించిన సర్పంచ్:

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డి.వై. నర్సింలు, ఉప సర్పంచ్ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల నమూనాలను, ప్రయోగాలను వారు ఆసక్తిగా పరిశీలించి, వాటి పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరచడం అభినందనీయమని వారు కొనియాడారు.

సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు:

అనంతరం ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ నర్సింలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ:
విద్యార్థులు మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని కోరారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని, ప్రతి ఒక్కరూ సి.వి. రామన్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ:
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని తెలిపారు. పాఠశాల స్థాయిలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో అద్భుతమైన ఆవిష్కరణలు చేయవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బయాలజీ ఉపాద్యాయులు శంకర్, నజీర్ అహ్మద్, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శ్రీధర్, పద్మావతి, సుజాత, శిరీష, అనురాధ, ప్రతిభ, జయశ్రీ, రాధా, అనితా, యాదగిరి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.