బసవన్న కట్ట దగ్గర ….మనవడే తాతపై హత్యాయత్నం …
బసవన్న కట్ట సమీపంలో పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ వ్యక్తిపై తన మనవడే హత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని బసవన్న కట్ట దగ్గర పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న అనంతయ్య అనే వ్యక్తి ఆయన మనుమడు రవి కత్తితో దాడికి పాల్పడ్డారు. గత మూడు సంవత్సరాల నుండి తన భార్య తనను వదిలి పెట్టి తమ పుట్టింటికి వెళ్ళింది. తన భార్యను తన దగ్గరికి పంపకుండా పుట్టింట్లోనే నివాసం ఉన్నందున ఆమెకు అన్ని విధాల చూసుకుంటున్న తాత అనంతయ్య పై రవి కక్ష పెంచుకున్నాడు. అంతలోనే తన దగ్గర ఉన్న కత్తితో అనంతయ్య దాడి చేశాడు. స్థానికులు గమనించి గాయాల పాలైన అనంతయ్యను తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
