తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పట్లోళ్ల నరసింహులు… ప్రభుత్వ ఆదేశాలు జారి
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పట్లోళ్ల నరసింహులు నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి పదవి చేపట్టిన రోజే పట్లోళ్ల నరసింహులు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యారు. గతంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పట్లోళ్ల బాల్‌రెడ్డి నియమించబడినప్పుడు పట్లోళ్ల బాల్‌రెడ్డి తన సతీమణి చైర్ పర్సన్ గా నియామకమైతే తాను తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యేకు మాట ఇచ్చారు. మాట ప్రకారం పట్లోళ్ల బాల్‌రెడ్డి రాజీనామా కూడా చేశారు దీంతో నాడు పట్లోళ్ల నరసింహులు ఏఎంసీ చైర్మన్ ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పట్లోళ్ల నరసింహులు నియామకం అయ్యారు. తాండూర్ హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, మాజీ డి పి సి సభ్యులుగా పట్లోళ్ల నరసింహులు తాండూరుకు ఎన్నో సేవలు అందించారు. ఆయన సతీమణి పట్లోళ్ల రత్నమాల మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ గా, కౌన్సిలర్‌గా సేవలందించారు. వారి సేవలను గుర్తించి ఎమ్మెల్యే పట్లోళ్ల నరసింహులు ఏఎంసీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నరసింహులు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చారని, మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం, రైతుల కోసం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
