July 31, 2026

తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగదల్లికే అధిష్టానం మొగ్గు…?

IMG_20260326_150519664_HDR

తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగదల్లి రవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులలో లింగదల్లి రవి కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని విడకుండా, కష్టకాలంలో కూడా లింగదల్లి రవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మాజీ కౌన్సిలర్ గా, మాజీ తాండూరు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శిగా, గోశాల మాజీ ఉపాధ్యక్షులుగా, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. లింగదల్లి రవికి తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అధిష్టానం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని అధిష్టానం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  భావిస్తున్నదని వినికిడి. లింగదల్లి రవికి పోటీగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జుబేర్ లాల ఉన్నట్టు సమాచారం. ఇదివరకే తాండూరు పట్టణ అధ్యక్షులుగా హబీబ్ లాల ఉన్నందున ఈసారి లింగదల్లి రవికి కట్ట పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.