September 19, 2026
oplus_2

oplus_2

అర్ధరాత్రి నుంచే నిరీక్షణ..
సిలిండర్ వస్తుందో రాదో అన్న ఆందోళనతో వినియోగదారులు తెల్లవారుజాము నుంచే ఖాళీ సిలిండర్లతో రోడ్ల పొడవునా బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపిస్తుండటంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెలివరీ వాహనాలు గ్రామాలకు రాకపోవడంతో సొంత ఖర్చులతో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై సిలిండర్లను తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల ఆగ్రహం.. 

నిత్యావసర వస్తువుల్లో అత్యంత కీలకమైన వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన స్టాక్‌ను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ కొరతను తీర్చి, సామాన్యుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.